మంచు ఇంట్లో గొడవ.. బిగ్గెస్ట్ రియాల్టీ షో!
ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ కొట్టుకుంటున్నట్లుగా ఓ వీడియో బయటికి వచ్చింది. విష్ణు.. మంచు ఇంటికి వెళ్లి ఏదో గొడవ చేస్తున్నప్పుడు మనోజ్ వీడియో తీసాడు. “ఇలా మా ఇంట్లోకి వచ్చిన అందరినీ కొడుతుంటాడండి” అంటూ మనోజ్ చెప్పాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాక కొద్దిసేపట్లోనే డిలీట్ చేసాడు. అప్పటకే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అసలు మనోజ్, విష్ణుల మధ్య గొడవ ఏంటో తెలుసుకోవాలని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచు బ్రదర్స్‌ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేసారు. అయితే అదంతా రియాల్టీ షో కోసం చేసిందట. ఈ విషయాన్ని విష్ణు ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ “హౌజ్ ఆఫ్ మంచూస్.. ఇండియాస్ట్ బిగ్గెస్ట్ రియాల్టీ షో.. ఇది ఆరంభం మాత్రమే” అని ట్వీట్ చేసారు. అంతేకాదు.. మొన్న జరిగిన గొడవ, పలు ఛానెళ్లు ఇచ్చిన కవరేజీ, ఇంట్లోని వారందరితో తీసిన వీడియోలను కలిపి ఓ ప్రోమోలా రిలీజ్ చేసారు. చూడబోతే మంచు ఫ్యామిలీ హాలీవుడ్ సెలబ్రిటీ షోను ఫాలో అవ్వోబోతున్నట్లు తెలుస్తోంది. “కీపింగ్ అప్ విత్ ది కర్దాషియాన్స్” అని హాలీవుడ్‌లో ఓ ఫ్యామిలీ షో బాగా ఫేమస్ అయింది. దానికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాంటిదే మొన్న బాలీవుడ్‌లోనూ.. ప్రముఖ సెలబ్రిటీ మలైకా అరోరా కూడా చేసింది. తన జీవితంలో ఏం జరుగుతుంటాయి, తన ఫ్యామిలీ విషయాలు ఏంటో ఫ్యాన్స్‌కి తెలీడం కోసం “మూవింగ్ ఇన్ విత్ మలైకా” అనే షోను చేసింది. ఇప్పుడు మంచు కుటుంబం కూడా ఇదే తరహాలో ప్లాన్ చేయబోతున్నట్లున్నారు.