Amarnath: చంద్ర‌బాబు వందేళ్లు బ‌త‌కాల‌ని కోరుకుంటున్నాం

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) వందేళ్లు బ‌త‌కాల‌నే కోరుకుంటున్నామ‌ని అన్నారు YSRCP నేత గుడివాడ అమ‌ర్నాథ్‌ (gudivada amarnath). అలాంటి వ్య‌క్తి బ‌తికి ఉంటేనే ఇలాంటి వారు కూడా ఉంటార‌ని ప్ర‌జ‌లకు ఒక ఉదాహ‌ర‌ణ‌గా చూపించ‌డానికైనా ఆయ‌న బ‌త‌కాల‌ని కోరుకుంటామ‌ని వెట‌కారంగా మాట్లాడారు. నిన్న త‌న తండ్రితో ములాఖాత్ అయ్యాక నారా లోకేష్ (nara lokesh) మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తోంద‌ని అంతా త‌న తండ్రి చావుని కోరుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో అమ‌ర్నాథ్ లోకేష్‌కు స‌మాధానం చెప్పాల‌ని ప్రెస్ మీట్ నిర్వ‌హించారు.

గ‌తంలో జ‌గ‌న్‌ను అరెస్ట్ చేయించేందుకు తెలుగు దేశం పార్టీ.. కాంగ్రెస్‌తో క‌లిసి వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసార‌ని ఆరోపించారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ (TDP) అటు భార‌తీయ జ‌న‌తా పార్టీతో (BJP) ఇటు కాంగ్రెస్‌తో (congress) మ‌ధ్య‌లో జ‌న‌సేన‌తో (janasena) పొత్తులు పెట్టుకుని వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి త‌న తండ్రిని విడిపించాల‌ని చూస్తోంద‌ని అన్నారు. అస‌లు పోలీసుల కాల్ డేటా ఎందుకు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. విచార‌ణ వ్య‌వ‌స్థ‌లు ఎవ‌రితోనైనా మాట్లాడుకుంటాయ‌ని అవ‌న్నీ నిందితుల‌కు ఎలా అప్ప‌గిస్తార‌ని అన్నారు.