Google: మ‌రో 30 వేల మందిని తీసేయ‌నున్న సంస్థ‌

Google: టెక్ దిగ్గ‌జం గూగుల్ మ‌రో 30వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. గూగుల్ ఆప‌రేషన్స్‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను వాడ‌నుంది. ఈ నేప‌థ్యంలో మాన్యువ‌ల్‌గా పనిచేస్తున్న వారిని తొల‌గించి వారి స్థానంలో ఏఐని అమ‌లు చేయ‌నుంది. గూగుల్‌కి సంబంధించిన సేల్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మాత్ర‌మే 30 వేల మందిని తీసేయ‌నుంది. 2023 జ‌న‌వ‌రి నుంచి గూగుల్ 12 వేల మందిని తొల‌గించింది. గూగుల్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వ‌ల్ల ఆదాయం కూడా బాగా పెరిగింది. దాంతో ఇక ఉద్యోగుల‌తో ప‌నిలేద‌ని గూగుల్ నిర్ణ‌యించుకుంది.