ఇంటర్వ్యూకి వెళ్తున్న కోడలిపై మామ దాష్టీకం
భర్తకు చేదోడు వాదోడుగా ఉంటాను అన్నందుకు కోడలు అని కూడా చూడకుండా మృగంలా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. దిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన కాజల్‌కి ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌తో వివాహం అయింది. ప్రవీణ్ పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నప్పటికీ తాను కూడా పనిచేసి భర్తకు కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంది కాజల్. అది నచ్చకపోవడంతో ప్రవీణ్ తండ్రి ఆమెను పలుమార్లు ఉద్యోగం వద్దు ఇంటి పట్టునే ఉండు అని తిట్టేవాడు. ఎలాగైనా ఉద్యోగంలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్న కాజల్.. బుధవారం ఇంటర్వ్యూకి వెళ్తుండగా.. ప్రవీణ్ తండ్రి ఇటుకలతో దాడి చేయడానికి యత్నించాడు. పలుమార్లు ఇటుక రాయితో కాజల్ తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు అవడంతో వైరల్‌గా మారాయి. అది గమనించిన స్థానికులు వెంటనే కాజల్‌ను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. తలకు బలమైన గాయం అవడంతో 17 కుట్లు వేసినట్లు వైద్యలు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.