KGF నీచ్ కమీన్ కుత్తే సినిమా:దర్శకుడి సంచలన కామెంట్స్
‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది’ పెద్దల మాట. అప్పుడే మన ఎదుగుదలను చూసి అందరూ ప్రశంసిస్తారు. అయితే కొందరు మాత్రం కాస్త ఫేం రాగానే తామే తెలివిగల వాళ్లమనే పొగరుతో మిగతా వారిని కించపరుస్తారు. వెనకా ముందు చూసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడి చిక్కుల్లో పడతారు. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల వెంకటేష్ ఓ ఇంటర్వ్యూ లో ‘కేజీఎఫ్’ సినిమా, అందులో హీరో యష్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల వెంకటేష్ మహా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయనతో పాటు దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఇండియన్ బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమలాంటి దర్శకులు తమ అభ్యుదయ భావాలను పక్కనపెట్టి సినిమాలు చేస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలం అని అన్నారు. కానీ, తాము అలాంటి సినిమాలు చేయడం లేదని, విలువలతో కూడిన సినిమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలను కూడా డిగ్రేడ్ చేస్తున్నారని, అవి ఓటీటీ సినిమాలు అని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇండైరెక్టుగా ‘కేజీఎఫ్ 2’ సినిమాను కోడ్ చేస్తూ ఒక సినిమా ఉంది. అందులో హీరో తల్లి కొడుకుని గొప్ప వాడు అవ్వాలని చెబుతుందని, మళ్లీ ఆ కొడుకు తల్లికు బంగారం తెస్తానని మాట ఇస్తాడు. అందుకోసం బంగారం తవ్వే వద్దకు వెళ్తాడు. అక్కడ వాళ్లను ఉద్దరిస్తాడు. మళ్లీ చివర్లో ఆ బంగారం తీసేవాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఆ బంగారం మొత్తం ఒక చోట పడేస్తాడు. అలాంటి గొప్పవాడు అవ్వమని ఆ తల్లి చెప్పడం. అలాంటి సినిమాను గొప్ప సినిమా అంటూ మనం ఎగబడి చూసేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వాదనలో ఎక్కడా వెంకటేష్ మహా సినిమా పేరు కానీ, దర్శకుడు పేరు కానీ, నటీనటులు పేర్లు కానీ చెప్పలేదు. అయితే తను చెప్పిన దాని ప్రకారం తను KGF సినిమాపై ఘాటు కామెంట్స్ చేశాడనే సుస్పష్టం. దీనిపై KGF ఫ్యాన్స్, యష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెంకటేష్ మహాపై ఘాటు కామెంట్స్ వస్తున్నాయి. ఇక ట్రోలర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు చేసిందే రెండు సినిమాలు..అందులో ఒకటి రీమేక్ అంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు.
అయితే ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ నందిని రెడ్డి జరిగిన విషయంపై సారీ చెబుతూ ట్వీట్ చేశారు. ‘ప్రేక్షకులకు నచ్చిన ప్రతీ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవుతుంది. కమర్షియల్ కథనాన్ని సానుకూలంగా చేయాలనే దానిపై పాజిటివ్‌గా జరిగిన చర్చ. మరొకరిని అవహేళన చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇందులో ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించగలరు’అని నందినీ రెడ్డి పేర్కొన్నారు.
వెంకటేష్ వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంత మంది నెటిజన్స్ దర్శకుడి మాటలకు మద్దతు ఇస్తుండగా మరికొంత మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా వెంటనే హీరో యష్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయన సినిమాలను కన్నడలో బ్యాన్ చేస్తామంటూ ఫైర్ అవుతున్నారు. వేరే దర్శకుడి సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయాలని అంతేగాని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని పలువురు హితవు పలుకుతున్నారు. మరి వెంకటేష్ మహా వ్యాఖ్యలపై హీరో యష్, ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారో చూడాలి.