ఇవిగోండి ఖ‌డ్గాలు.. చేతులు న‌రికేయండి

BJP MLA Distributes Swords Among Girls

BJP: భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆడ‌పిల్ల‌ల‌కు ఖ‌డ్గాలు పంచిపెట్టారు. ద‌స‌రా సంద‌ర్భంగా పూజ‌లో పాల్గొన్న బిహార్‌కి చెందిన ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ పూజా కార్యక్ర‌మంలో పాల్గొన్న అమ్మాయిల‌కు ఖ‌డ్గాలు పంచిపెట్టారు. వ‌క్ర బుద్ధితో చూసే మ‌గ‌వాళ్ల చేతులు న‌ర‌క‌డం నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేసారు. ఈ రోజుల్లో ఏ మ‌గాడైనా ఆడ‌దానిపై చెయ్యి వేయ‌డానికి క్ష‌ణం కూడా ఆలోచించ‌డం లేద‌ని అలాంట‌ప్పుడు ఆడ‌పిల్ల‌లే త‌మని తాము ర‌క్షించుకోవాల‌ని అన్నారు. బ‌య‌టికి వెళ్లే స‌మ‌యాల్లో ఈ ఖడ్గాలు తీసుకెళ్లాల‌ని.. ఎవ‌రైనా అబ్బాయి ఏడిపిస్తున్న‌ట్లు కానీ వేధిస్తున్న‌ట్లు కానీ క‌నిపిస్తే అక్కడిక‌క్క‌డే చేతులు న‌రికేయాల‌ని పిలుపునిచ్చారు. దీనిపై బిహార్‌లో ర‌చ్చ రాజుకుంది. ఆడ‌పిల్ల‌ల‌కు ధైర్యం చెప్ప‌డంలో త‌ప్పు లేదు కానీ ఇలా న‌ర‌కండి అని చెప్తే రేపు వారు నిజంగా న‌రికేస్తే ఎవ‌రిది బాధ్య‌త అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.