ఆ డాల‌ర్ శేషాద్రితోనే ప్రాబ్లం: బండ్ల గ‌ణేష్ షాకింగ్ కామెంట్స్

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ వైర‌ల్ అయ్యారు. ఇంట‌ర్వ్యూల్లో, ఈవెంట్ల‌లో తన‌దైన శైలిలో మాట్లాడి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంటారు బండ్ల గ‌ణేష్‌. ఇప్పుడు ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా ఆన్స‌ర్ ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. నారాయ‌ణ అనే ప‌వ‌న్ అభిమాని ఒకరు ట్విట‌ర్‌లో బండ్ల గ‌ణేష్‌కు ఒక ట్వీట్ చేసారు. అన్న పవన్ అన్నకి నీ అపార్దాలతో దూరంగా ఉండ‌కు. ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి నీలాంటి వాళ్ళు కొంచెం రిలీఫ్ . సమయం దొరికినప్పుడు కలువు. ఆయన్ని అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు. మీరు అలా కావద్దు. అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

దీనికి బండ్ల గ‌ణేష్ స‌మాధానంగా.. మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం. ఏం చేద్దాం బ్రదర్ అన్నారు. అయితే ఆయ‌న ఎవ‌ర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారో తెలీదు కానీ నెటిజ‌న్లు మాత్రం.. ఇది ముమ్మాటికీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ గురించే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తంలో.. బండ్ల గ‌ణేష్‌కి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైర‌ల్‌గా మారింది. అందులో బండ్ల గ‌ణేష్.. ప‌వ‌న్ సినిమాల‌కు సంబంధించిన ఈవెంట్ల‌కు రావ‌ద్ద‌ని త్రివిక్ర‌మ్ అన్నాడ‌ని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. ఇప్పుడు రాజ‌కీయాల విష‌యంలోనూ ప‌వ‌న్‌కి దూరంగా ఉండేలా చేస్తున్నార‌ని బండ్ల గ‌ణేష్ అంటున్నారు. అయితే ఆ వ్య‌క్తి త్రివిక్ర‌మా? లేక ఎల్ల‌ప్పుడూ ప‌వ‌న్‌కి స‌పోర్ట్‌గా నిలిచే నాదెండ్ల మ‌నోహ‌రా? అన్న‌ది మాత్రం బండ్ల గ‌ణేష్‌కే తెలియాలి. ఏదేమైనా.. గ‌తేడాది గుండెపోటుతో చ‌నిపోయిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అర్చ‌కులు డాల‌ర్ శేషాద్రి పేరును ప్ర‌వ‌స్తావించ‌కుండా ఉండాల్సింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.