YSRCP: అంతర్గత సంక్షోభం.. కారణాలు ఇవే!
vijayawada: వైసీపీ(ycp)లో అంతర్గత సంక్షోభం(internal crisis) స్పష్టంగా కనిపిస్తోంది. అనేక జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల(gap between mla and mps)కు మధ్య సయోధ్య లేని పరిస్థితి ఉంది. మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి ఎంపీలతో అక్కడి ఎమ్మెల్యేలు(కొందరు) సఖ్యతగా లేరు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఒకరి కార్యక్రమాలలో మరొకరు పాల్గొనడం లేదు. ఒకవేళ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తే.. ఎడమొఖం, పెడమొఖంగానే ఉంటున్నారు. దీనికి కారణం ఆధిపత్య ధోరణి అని నాయకులు చెబుతున్నారు. పార్టీ పెద్దలు కూడా అలాంటి వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా.. ఫలితం లేని పరిస్థితి. మరికొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య అగాధం ఏర్పడింది. ప్రొటోకాల్, జిల్లాలో తనకు ప్రాధాన్యం తగ్గిపోయిందన్న భావనతో ఇటీవల ఒంగోలు వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ex minister balineni srinivas reddy).. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇలా కొందరు బయట పడి తమ ఇబ్బందులు బాహాటంగా చెప్పేస్తుండగా.. మరికొందరు ఏమీ చెయ్యలేని స్థితిలో మౌనంగా ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చింది. అన్ని పనులు వాలంటీర్లు, సచివాలయాల ద్వారా జరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగేందుకు కూడా ఇష్టపడట్లేదు. దీనికి కారణం ప్రజల నుంచి స్పందన లేకపోవడమే. ఇప్పటికే పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, స్థానిక సమస్యలు-నిధుల వేట, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్ వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల చోటామోటా నాయకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. దమ్మిడీ ఆదాయం లేని తరుణంలో ఇన్నేసి కార్యక్రమాలు చేయమనడం తమకు భారంగా మారిందని వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యేల దగ్గరి నుంచి క్యాడర్లో కూడా అసంతృప్తి ఉందని సమాచారం.