NTR 30 నుంచి అదిరిపోయే అప్​డేట్​!

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రోజు రానే వచ్చింది. NTR 30 అనౌన్స్​ చేసినప్పటినుంచీ తారక్​ సరసన నటించబోతున్న హీరోయిన్​ ఎవరా? అని తెలుసుకునేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్​తో జోడీ కట్టేది ఈ హీరోయిన్​! అంటూ చాలామంది పేర్లు హల్​చల్​ చేశాయి. అయితే ఆ వార్తలన్నింటికీ చెక్​ పెడుతూ NTR 30 హీరోయిన్​ ఎవరనేది రివీల్​ చేశారు. అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్​ తారక్​కి జోడిగా నటించనుందని ప్రకటించేశారు మేకర్స్​. NTR 30తో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్​ అయ్యింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ​
ఎన్టీఆర్​తో జతకట్టేది జాన్వీ కపూర్​ అంటూ చాలాకాలంగా వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ జాన్వీనే ఈ సినిమాలో హీరోయిన్ అంటూ అదిరిపోయే పోస్టర్ కూడా విడుదల చేశారు. జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని యూనిట్ ‘NTR30’కి సంబంధించి ఆమె లుక్‌ను విడుదల చేశారు. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ అంటూ మేకర్స్ వదిలిన ఈ పోస్టర్‌లో జాన్వీ కపూర్ చూడముచ్చటగా ఉంది. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ క్యాప్షన్‌కు అనుగుణంగానే పోస్టర్‌లో కొండలు, సముద్రం చూపించారు. సముద్రపు అంచున కూర్చున్న జాన్వీ కపూర్ క్యూట్ లుక్‌తో ఆకర్షిస్తోంది.
అతి త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ముచ్చట పూర్తవగానే.. ‘NTR30’ షూటింగ్‌ పూజా కార్యక్రమాలు జరిపి.. వెంటనే సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జాన్వీ పోస్టర్​తో అభిమానులు కాస్త చ‌ల్ల‌బ‌డ్డార‌నే చెప్పుకోవాలి.
మార్చి నెల‌లో NTR 30 సినిమా షూటింగ్‌ను లాంఛ‌నంగా స్టార్ట్ చేసి షూటింగ్‌ను కూడా షురూ చేయ‌బోతున్నారని తెలుస్తోంది. అమెరికా నుంచి ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత NTR 30 ట్రాక్ ఎక్కేస్తుంది. సినిమా స్టార్ట్ కాకుండానే మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది అంటే 2024, ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ సైతం త‌న పోస్ట‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్‌గారికి థాంక్స్ అని కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్​ జాన్వీ పోస్ట్​కి కామెంట్స్​ చేయడం ఫ్యాన్స్​లో మరింత ఉత్సాహం నింపుతోంది. ‘వెల్​కమ్​ ఆన్​ బోర్డ్​ జాన్వీ.. విషింగ్​ ఎ వెరీ హ్యాపీ బర్త్​ డే’ అంటూ బృందంలోకి స్వాగతం పలకడంతోపాటు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు. దీంతో చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ 30 హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై వ‌స్తున్న వార్త‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో NTR 30 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్​ ఆస్కార్​ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా బయలుదేరిన విషయం తెలిసిందే.