Birthday Special: బన్నీ అందుకున్న అవార్డులెన్నో తెలుసా​!

కెరీర్​ ఆరంభం నుంచీ ఒక్కో సినిమాకు భిన్నమైన పాత్రలతో టాలీవుడ్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఐకాన్​ స్టార్​గా ఎదిగారు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన గంగోత్రితో టాలీవుడ్​లో అడుగుపెట్టిన బన్నీ తన మొదటి సినిమాకు పలు విమర్శలు ఎదుర్కొన్నా వాటిని అదిగమించి రెండో సినిమా ఆర్యతోనే స్టైలిష్​ స్టార్​ అనిపించుకున్నారు. ఇక, సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా మారిన బన్నీ తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బన్ని మాస్​ లుక్స్​, యాక్టింగ్​, డైలాగ్​ డిక్షన్​ అభిమానులను కట్టిపడేసాయి. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన పుష్ప బన్ని కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ​2003లో విడుదలైన గంగోత్రి నుంచి పుష్ప వరకు చాలా అవార్డులు అందుకున్నారు బన్ని. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ పుట్టినరోజు(ఏప్రిల్​ 08) సందర్భంగా ఆయన ఇరవై ఏళ్ల కెరీర్​లో అందుకున్న అవార్డులేంటో తెలుసుకుందాం..
IIFA
ఇంటర్నేషనల్​ ఇండియన్​ ఫిల్మ్​ అకాడమీ(IIFA)అవార్డుల్లోనూ అల్లు అర్జున్​ మూడు సార్లు ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేట్​ అయ్యారు. కాగా, రుద్రమదేవి సినిమాకుగాను బన్ని ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఈ అవార్డు అందుకున్నారు.
SIIMA
సౌత్​ ఇండియన్​ ఇంటర్నేషనల్​ మూవీ అవార్డు(SIIMA)ల్లోనూ పలు సినిమాలకుగాను ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్స్​కు ఎంపికైన బన్నీ రేసుగుర్రం సినిమాకుగానూ స్టైలిష్​ యూత్​ ఐకాన్​ ఆఫ్​ సౌత్​ ఇండియన్​ సినిమా అవార్డు అందుకున్నారు. అంతేకాదు, ఉత్తమ నటుడిగా రుద్రమదేవి, అలవైకుంఠపురంలో.., పుష్ప సినిమాలకూ సైమా అవార్డు అందుకున్నాడు బన్నీ.
నంది అవార్డులు
అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన మొదటి సినిమాకే నంది అవార్డుకు నామినేట్​ అయి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఆర్య, పరుగు, వేదం సినిమాలకూ ఉత్తమ నటుడిగా, రుద్రమదేవి సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డులు అందుకున్నారు స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​.
ఫిలింఫేర్​
సినీ పరిశ్రమలో ఉత్తమ నటులకు అందించే ప్రతిష్టాత్మక అవార్డులో ఒకటి ఫిలింఫేర్​. ఈ అవార్డుల ఎంపికలో ఆర్య నుంచి పుష్ప వరకు పదిసార్లు నామినేట్​ అయిన అల్లు అర్జున్​ ఏకంగా ఆరు ఫిలింఫేర్​ అవార్డులను అందుకున్నారు. అల్లు అర్జున్​ నటించిన పరుగు, వేదం, రేసుగుర్రం, పుష్ప సినిమాలకుగాను ఉత్తమ నటుడు కేటగిరీలో, రుద్రమదేవి సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా, సరైనోడు సినిమాకు ఉత్తమ నటుడు క్రిటిక్స్​ ఛాయిస్​ విభాగాల్లో ఫిలింఫేర్​ అవార్డులు దక్కించుకున్నారు.
సంతోషం
తెలుగు పరిశ్రమలో అందించే ప్రతిష్టాత్మక సంతోషం అవార్డుల్లోనూ అల్లు అర్జున్​ సత్తా చాటారు. గంగోత్రి సినిమాకుగానూ బెస్ట్ డెబ్యూ హీరోగా, ఆర్య, బన్నీ సినిమాలకుగానూ బెస్ట్​ యంగ్​ పెర్ఫార్మర్​గా సంతోషం సినిమా అవార్డులను అందుకున్నారు.

ఇవే కాకుండా, సాక్షి ఎక్సలెన్స్, TV9, జీ తెలుగు సినీ అవార్డ్స్​, మిర్చి సౌత్​ మ్యూజిక్, ​CineMAA,సౌత్​ స్కోప్​ లైఫ్​స్టైల్​ అవార్డులతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాదు సోషల్​ మీడియా ఫాలోవర్స్​ సంఖ్యలోనూ రికార్డులు సృష్టించిన బన్నీ గూగుల్​ సెర్చ్​, మోస్ట్​ ఫాలోయింగ్​ సెలబ్రిటీ ఇన్​ సోషల్​ మీడియా వంటి టైటిల్స్​ కూడా అందుకున్నారు.
ఇక, పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్ స్థాయిలో ఎన‌లేని క్రేజ్‌ను సొంతం చేసుకు అర్జున్‌​ మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును చేసుకున్నారు. గత సంవత్సరానికి గానూ ఎంటర్​టైన్​మెంట్​ విభాగంలో ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డును అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డున ద‌క్కించుకున్న తొలి సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా బ‌న్నీ నిలిచారు. ఈ అవార్డును కొవిడ్ స‌మ‌యంలో ప్రాణాల‌కు తెగించి ప‌నిచేసిన ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు అంకితం ఇస్తున్న‌ట్లు అల్లు అర్జున్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్​గా రూపొందుతున్న పుష్ప2 ది రూల్​ షూటింగ్​తో బిజీగా ఉన్నారు బన్ని. ఇక, బన్ని బర్త్​డే సందర్భంగా విడుదల చేసిన టీజర్​ పుష్ప2పై భారీ అంచనాలను పెంచేస్తోంది. అమ్మోరు అవతారంలో బన్ని లుక్స్​ ఇంటర్​నెట్​ని షేక్​ చేస్తున్నాయి. సూపర్​ సక్సెస్​ఫుల్​ హీరోగా సాగుతున్న ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​కి న్యూస్​ ఎక్స్​ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.​