NTR​ పిల్లలకు స్పెషల్​ గిఫ్ట్స్​ పంపిన స్టార్​ హీరోయిన్​

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో బాలీవుడ్​ భామ ఆలియా భట్​ టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజువల్​ వండర్​గా విడుదలైన ఈ పీరియాడిక్​ డ్రామా కలెక్షన్లు, అవార్డుల పరంగా పాన్​ఇండియా లెవల్లో రికార్డులు క్రియేట్​ చేసింది. తాజాగా ఆస్కార్​ కైవసం చేసుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఈ సినిమాలో రామ్​, భీమ్​గా అలరించిన మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ పాన్​ఇండియా స్టార్లుగా క్రేజ్​ సాధాంచారు.​ కాగా ఈ సినిమా విడుదలై మార్చి 25కి సరిగ్గా సంవత్సరం అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్​ భామ ఆలియా భట్​ ఎన్టీఆర్​ పిల్లలకు ప్రత్యక బహుమతులు పంపింది. ఈ విషయాన్ని స్వయంగా తారక్​ తన సోషల్​ మీడియా ఖాతాలో పోస్ట్​ చేస్తూ ఆలియాకు కృతజ్ఞతలు తెలపడంతో వైరల్​గా మారింది.

ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో ఎన్టీఆర్​కి జోడీగా హాలీవుడ్​ భామ ఓలీవియా నటించగా రామ్ చరణ్​కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, ఆలియా భట్ మంచి స్నేహితులయ్యారు. ప్రమోషన్లలో వీరి అల్లరి అభిమానులను అలరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ కుమారులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ స్పెషల్ గిఫ్ట్ పంపించింది ఆలియా భట్. ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆలియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు ఎన్టీఆర్. సినిమాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్న ఆలియా కాన్షియస్ క్లాతింగ్ పేరుతో ఓ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లకు ఆ కంపెనీ దుస్తులను ప్యాక్ చేసి పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేయడమే గాక.. ఆ బ్యాగులపై అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లు కూడా రాసిపెట్టింది. ఈ రెండు బ్యాగ్స్​ ఫొటో జతచేసి కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. ‘థ్యాంక్స్‌ అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ గిఫ్ట్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని నింపింది. నా పేరు మీద కూడా ఓ బ్యాగ్ చూడాలనుకుంటున్నా..’ అంటూ సరదా కామెంట్​ కూడా జోడించారు తారక్​.

RRR సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, సీతగా ఆలియా భట్ కనిపించింది. ఈ పాత్రలు సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.