Pawan Kalyan: దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం.. బూట్లతో లోపలికి వెళ్లిన పోలీస్ అధికారిపై వేటు
Pawan Kalyan: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేసిన పోలీసులు ఇప్పుడు అధికారం పోయాక కూడా అలాగే ప్రవర్తిస్తామంటే కుదరదు. ఎన్నికలకు జనసేన కార్యాలయంలో పనిచేసే వారి ఇళ్లల్లోకి చొరబడి సోదాలు నిర్వహించిన మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు.. ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తన కార్యాలయంలో వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. ఓ పక్క పూజ జరుగుతుండగా.. శ్రీనివాసరావు హడావుడి చేసారు. పవన్ దీక్షలో ఉన్నారు అని అధికారులు చెప్తున్నా అయితే ఏంటి అనుకుంటూ బూట్లు వేసుకునే లోపలికి వెళ్లారు. దాంతో అధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేసారు. దాంతో వెంటనే ఆయన శ్రీనివాసరావును బదిలీ వేటు వేసారు.