Hanuman: సినిమాపై నెగిటివిటీ… ఎందుకు?
Hanuman: తేజ సజ్జ (Teja Sajja) నటించిన హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గుంటూరు కారం (Guntur Kaaram) లాంటి పెద్ద సినిమానే ఢీకొట్టి మరీ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ఇక చాలా డ్రామా జరిగిన తర్వాత ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి హనుమాన్ జీ5లో ప్రసారం అవుతోంది. అయితే ఈ సినిమాపై X (ట్విటర్)లో ఎంతో నెగిటివిటీ ఉంది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలో సినిమాను రిలీజ్ చేసారు కాబట్టే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుందని.. ఓటీటీలోకి వస్తే కానీ అసలు సినిమాలో ఏమీ లేదని తెలీలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఈ సినిమాలో వాడిన VFX టీవీ సీరియల్‌ను తలపించేలా ఉందని.. ఇలాంటి సినిమాను బ్లాక్ బస్టర్ విజయం ఎలా చేసారో ఇప్పటికీ అర్థంకావడంలేదని వాపోతున్నారు. ఇలాంటి సినిమా వల్లా గుంటూరు కారం కలెక్షన్లలో ఓడిపోయింది అంటూ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆడిపోసుకుంటున్నారు. అసలు ఇంత నెగిటివిటీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సినిమా అందరికీ నచ్చాలని అంతకన్నా లేదు. ఆల్రెడీ థియేటర్లలో సత్తా చాటిన సినిమాలకు ఓటీటీలో అదే రేంజ్‌లో స్పందన వస్తుందన్న గ్యారెంటీ లేదు. (Hanuman)