Hanuman: రిషభ్ శెట్టి ఎందుకు నో చెప్పారు?
Hanuman: ప్రశాంత్ వర్మ (prashant varma) దర్శకత్వంలో తేజ సజ్జ (teja sajja) నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి విన్నర్‌గా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మహేష్ బాబు (mahesh babu) నటించిన గుంటూరు కారం (guntur kaaram) కలెక్షన్లను కూడా దాటేసి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ ప్రముఖ కన్నడ నటుడు రిషభ్ శెట్టిని (rishab shetty) సంప్రదిస్తే ఆయన నో చెప్పారట. ఇందుకు కారణం ఆయన కాంతార (kantara) సినిమాతో బిజీగా ఉండటమే అని తెలుస్తోంది. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ రిషభ్‌ను కలిసారు. కాస్త డేట్లు సర్దుబాటు చేసుకుని హనుమాన్‌లో నటించి ఉంటే బాగుండేది అని రిషభ్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నట్లు తెలుస్తోంది.
యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన హనుమాన్ టీం
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను (yogi adityanath) హనుమాన్ చిత్ర బృందం కలిసింది. హనుమాన్ సినిమా గురించి ఆయనతో వివరించి హిందీలో డబ్బింగ్ చేసి థియేటర్లకు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయనతో చర్చించారు. ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు మరిన్ని తీయాలని యోగి వారితో చెప్పినట్లు తెలుస్తోంది.