Vishal: ప్రభాస్ పెళ్లయ్యాక నేను చేసుకుంటా
Vishal: ప్రభాస్ (Prabhas) పెళ్లయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని అన్నారు విశాల్. ఆయన నటించిన రత్నం సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ పెళ్లి టాపిక్ వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రభాస్ చేసుకున్నాక.. తప్పకుండా ఓ మంచి అమ్మాయిని చూసి తాను కూడా పెళ్లి చేసుకుంటానని తెలిపారు.
నిజానికి విశాల్.. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలి. వీరిద్దరూ కొంతకాలం పాటు డేటింగ్‌లో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నడిగర్ సంఘం విషయంలో విశాల్‌కు.. వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌కు మధ్య విభేదాలు వచ్చాయో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విశాల్ ఓ నటిని వివాహం చేసుకోవాలనుకున్నారు. వీరికి నిశ్చితార్ధం కూడా జరిగింది. కానీ విశాల్ నడిగర్ సంఘానికి ఓ భవనం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోనని అనడంతో ఆమెతో కూడా పెళ్లి రద్దయ్యింది. ఇక ఇప్పుడు విశాల్ ఎవరిని చేసుకుంటారా అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ:
Vishal: సల్మాన్‌కి పెళ్లయ్యాక చేసుకుంటా
విశాల్‌కి సంబంధించిన అన్ని వార్తల కోసం : https://telugu.newsx.com/tag/vishal/