‘థాంక్యూ అన్నా’.. రామ్ చరణ్‌కి రౌడీ హీరో స్వీట్ రిప్లై!
Hyderabad: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విజయ్‌కి శుభాకాంక్షలు తెలుపు తున్నారు. ‘ది విజయ్ దేవరకొండ’(The Vijay Deverakonda) అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా, విజయ్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇక విజయ్ పుట్టినరోజు స్పెషల్ ట్రీట్‌గా హైదరాబాద్, బెంగళూర్ వంటి పట్టణాల్లోని అభిమానులందరికీ ఫ్రీగా క్రీమ్ స్టోన్(Cream stone) ఐస్‌క్రీమ్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.
ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీస్లోనూ విజయ్‌కి అభిమానులు ఎక్కువే. ఉదయాన్నే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి స్పెషల్ విషెస్ తెలుపగా, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా విజయ్ దేవరకొండకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండకు మెగా పవర్ స్టార్ తన విషెస్ చెబుతూ గ్రీట్ చేశారు. విజయ్ అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో తమ అభిమాన హీరో బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా అభినందనీయం అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు చరణ్. ఈ ట్వీట్‌కు విజయ్ ‘థ్యాంక్యు అన్నా.. వారు ఎల్లప్పుడూ నన్ను సంతోషపెట్టడమే కాకుండా గర్వించేలా చేస్తున్నారు..’ అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రౌడీ స్టార్ ప్రస్తుతం సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘ఖుషి’(Kushi) మూవీలో నటిస్తుండగా ఆర్ఆర్ఆర్(RRR)తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer) షూటింగ్లో బిజీగా ఉన్నారు.