Abhishek Nama: నాకు విజయ్ నుంచి రూపాయి వద్దు
తనకు కావాల్సింది విజయ్ దేవరకొండ (vijay devarakonda) నుంచి డబ్బు కాదని..తమతో ఒక సినిమా చేయడం మాత్రమేనని అన్నారు డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా (abhishek nama). విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ (world famous lover) సినిమాకు అభిషేక్ నామా, సునీల్ నరంగ్ కలిసి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో ఇద్దరూ కలిపి 12 కోట్ల వరకు నష్టపోయారు. ఇప్పుడు ఖుషి సినిమా రిలీజ్ అవడంతో విజయ్ ఫ్యాన్స్‌కి కోటి రూపాయల వరకు దానం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాతలు.. తాము నష్టపోయిన రూ.8 కోట్లు కూడా తిరిగిస్తే బాగుంటుందని ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. దీనిపై డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఇలా స్పందించారు. (abhishek nama)
“” నాకు విజయ్ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అవడంతో నేను సునీల్ నరంగ్, ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు ఎంతో నష్టపోయాం. ఈ సినిమా రిలీజ్‌కి ఫైనాన్షియర్ల సాయం కావాలని ఓసారి విజయ్ మేనేజర్ అనురాగ్ మా దగ్గరికి వచ్చాడు. ఇందుకు మేం సాయం చేసాం. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాతో ఇంకో సినిమా చేయాలని అడిగాం. ఇందుకు విజయ్ కూడా ఒప్పుకున్నాడు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత విజయ్ కూడా మాతో మాట్లాడలేదు. ఫోన్లు, మెసేజ్‌లకు కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. విజయ్‌కి రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత రామారావు తన ప్రాపర్టీని తాకట్టు పెట్టారు. అలాంటి విజయ్ కనీసం ఆయన నష్టపోతే సాయం కూడా చేయలేదు. ఇప్పుడు ఖుషి హిట్ అవడంతో ఫ్యాన్స్‌కి కోటి రూపాయలు ఇస్తాను అనడంతో మాకు ఒళ్లుమండింది “”
“” మేం సినిమాలు తీస్తేనే కదా ప్రజలు సినిమాలు చూసేది. మరి మాకు నష్టం వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఖుషి సినిమాకు అంతగా కలెక్షన్లు రాలేదు. ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు. విజయ్ కెరీర్ ఇప్పుడు ఊగిసలాడుతోంది. ఈ విషయం విజయ్ గ్రహిస్తే మంచిది. ఓసారి నేను, నరంగ్ విజయ్‌ని కలవడానికి ఇంటికి వెళ్తే వాళ్ల నాన్న మాట్లాడారు. అక్కడ మేనేజర్ అనురాగ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ ప్యాన్ ఇండియా హీరో అని కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్స్‌తోనే కలిసి పనిచేస్తాడని అన్నారు. ఒకవేళ మాతో సినిమా తీయాలంటే డైరెక్టర్‌గా త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలీ లాంటివారిని తీసుకురావాలని అన్నారు. అది కుదరదు అని చెప్పాం. ఇప్పుడు విజయ్‌కి ఖుషి కంటే మంచి సినిమా కావాలి. ఆయన ఒప్పుకుంటే మేం మంచి స్క్రిప్ట్ తీసుకొస్తాం. ఇక నిర్ణయం విజయ్‌దే..“” అని ఆవేదన వ్యక్తం చేసారు అభిషేక్. (abhishek nama)