Vijay Devarakonda: బాధపెట్టి ఉంటే క్షమించండి నాన్నా..!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ తన తండ్రికి క్షమాపణలు చెప్తూ తన జీవితానికి తన కుటుంబానికి ఆయనే ఫ్యామిలీ స్టార్ అని అన్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా తన కుటుంబంలోని ఫ్యామిలీ స్టార్ గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు.
“” నా ఫ్యామిలీ స్టార్. మీకు లేకుండా నేను లేను. చిన్నప్పుడు నేను మీ వేలు పట్టుకుని వేసిన బుడి బుడి అడుగుల నుంచి ఇప్పుడు వేస్తున్న అడుగుల వరకు మీరు నా వెన్నంటే ఉండి నన్ను గమనిస్తున్నారని నాకు తెలుసు. నేను కష్టపడకూడదని మీరు కష్టపడ్డారు. నేను సంతోషంగా ఉండాలని మీరు మీ ఆనందాలను త్యాగం చేసారు. మీరే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్.. ఫస్ట్ హీరో.. మీరే నా బలం. తెలిసో తెలీకో నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. మిమ్మల్ని గర్వంగా ఫీలయ్యేలా చేయడంలోనే నా విజయం ఉంది “” అని పేర్కొంటూ తన తండ్రితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.