Vijay Antony: హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా..!

Hyderabad: తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని(vijay antony) ఓ హోటల్లో వెయిటర్ అవతారం ఎత్తారు. ఆయన నటించిన ‘బిచ్చగాడు-2′(bichagadu 2) మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ వెయిటర్‌గా మారి తానే స్వయంగా అందరికీ ఫుడ్ వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవతోంది.