Vijay Antony: రెండో కూతురితో కలిసి సినిమా ప్రమోషన్స్..!
పెద్ద కూతురు ఆత్మహత్యతో పుట్టెడు దుఖంలో ఉన్న నటుడు విజయ్ ఆంటోనీ.. (vijay antony) ఓ ఈవెంట్ కోసమని తన రెండో కూతురు లారాతో కలిసి హాజరయ్యారు. బాధ నుంచి ఇంకా తేరుకోకముందే ప్రొడ్యూసర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లకు ఇచ్చిన మాట కోసం ఆయన మొదటిసారి బయటికి వచ్చారు. విజయ్ ఆంటోనీ రత్తం అనే సినిమాలో యాక్ట్ చేసారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగానే ఆయన లారాతో కలిసి వెళ్లారు.
కొన్ని రోజుల క్రితం విజయ్ పెద్ద కూతురు మీరా (meera) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ చదువుతున్న మీరా కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందని దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోందని విజయ్ తరఫు సన్నిహితులు తెలిపారు. మీరా మృతితో విజయ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మీరా అంత్యక్రియలు పూర్తైన మూడు రోజుల తర్వాత తన గదిలో దొరికిన సూసైడ్ లెటర్‌ను విజయ్ పోలీసులకు అప్పగించారు. (vijay antony)