Vennela Kishore సూపర్ టిప్.. నాకూ కావాలన్న బ్రహ్మాజీ!
Hyderabad: కమెడియన్ వెన్నెల కిశోర్ (vennela kishore) ఓ సూపర్ టిప్ చెప్పారు. ఉదయాన్నే వాట్సాప్ గ్రూప్స్‌లో గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందికి ఈ మెసేజ్‌లు ఇరిటేటింగ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఓకే కానీ రోజూ ఇలాంటి మెసేజ్‌లు చూడాలంటే విరక్తి కలుగుతుంది. అయితే ఈ మెసేజ్‌లు రాకుండా ఉంటడానికి వెన్నెల కిశోర్ (vennela kishore) ఓ టిప్ చెప్పారు. ఆయనకు కూడా వాట్సాప్ గ్రూప్స్‌తో ఈ గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లు ఎక్కువైపోయాయట. దాంతో వాటికి రిప్లైగా ఒకే కామన్ జిఫ్ పంపేవారట. అదేంటంటే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఓ పెద్దాయన వెనక్కి తిరిగి ప్రకాశ్‌రాజ్‌ని చూసి నవ్వుతాడు. ఆ సీన్‌ని జిఫ్‌గా చేసి గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లు పంపేవారికి ఈ జిఫ్‌ని ఆటో రెస్పాన్స్ ఆప్షన్‌గా పెట్టారట. దాంతో ఆ మెసేజ్‌లన్నీ తగ్గిపోయాయట. ఈ విషయాన్ని వెన్నెల కిశోర్ (vennela kishore) ట్విటర్‌లో పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ చూసిన నటుడు బ్రహ్మాజీ (brahmaji).. నాక్కూడా కావాలి అని ట్యాగ్ చేసారు.
There has been a subsequent decrease in good morning txts n random whatsapp fwds since I’ve been using this video as an auto-response😂😜🙈 pic.twitter.com/OtRzYYwCUV
— vennela kishore (@vennelakishore) May 27, 2023