Ustaad Bhagat Singh: ఎడిటింగ్ షురూ!

Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్ ముగించుకుంది. ఇక ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ అప్డేట్ కోసం తాజాగా ఎడిటింగ్ వర్క్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్​ కల్యాణ్​ ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమా నుంచి త్వరలోనే ఓ అదిరిపోయే అప్​డేట్​ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్​. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ రానుందని.. అభిమానలు సిద్ధంగా ఉండాలంటూ దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి త్వరలోనే సాలిడ్ అప్డేట్ రానుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గబ్బర్​ సింగ్​(Gabbar singh) లాంటి సాలిడ్​ హిట్​ అందుకున్న ఈ క్రేజీ కాంబోలో రానున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఆ అప్​డేట్​ ఏంటో, ఎప్పుడు వస్తుందనే క్లారిటీ ఎప్పుడు వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.