ఒకే ఒక్క హిట్ సినిమా.. ఆస్తి మాత్రం రూ.11,764 కోట్లు

tyler perry is the richest actor with 11764 crore property

Tyler Perry: సినిమా రంగంలో బోలెడు హిట్ సినిమాలు తీసే హీరోలే ఎక్కువ డ‌బ్బులు సంపాదిస్తుంటారు. ఆ లెక్క‌న చూసుకుంటే మ‌న ఇండియాలో చాలా మంది రిచెస్ట్ న‌టులు ఉన్నారు.  కానీ పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్యక్తిని చూసారా? ఇత‌ను ఓ న‌టుడు. పేరు టైల‌ర్ పెర్రీ. కెరీర్ మొత్తంలో ఆయ‌న చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఆయ‌న ప్ర‌పంచంలో ఉన్న న‌టీన‌టుల్లో ఏకైక కోటీశ్వ‌రుడు. టైల‌ర్ ఆస్తుల విలువ రూ.11,764 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ న‌టుల్లో టైల‌ర్ పెర్రీ పేరు టాప్‌లో ఉంది.

రెండో స్థానంలో హాలీవుడ్ క‌మెడియ‌న్ జెర్రీ సైన్‌ఫీల్డ్ ఉన్నారు. ఈయ‌న ఆస్తి విలువ రూ. 8,403 కోట్లు. ఇక టైల‌ర్ పెర్రీ విష‌యానికొస్తే ఆయ‌న న‌టించిన సినిమాల్లో ది డైరీ ఆఫ్ ల మ్యాడ్ బ్లాక్ ఉమెన్ సినిమా మాత్ర‌మే హిట్ అయ్యింది. అంతేకాదు.. యావ‌త్ హాలీవుడ్ ప్ర‌పంచంలో ఓ సొంత స్టూడియో ఉన్న ఏకైక న‌టుడు కూడా టైల‌రే. ఈ స్టూడియో నుంచే టైల‌ర్‌కు ఏటా రూ.2679 కోట్లు వ‌స్తాయి. ఇక ఇండియాలో రిచెస్ట్ యాక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. ఈయ‌న ఆస్తి విలువ రూ. 7,310 కోట్లు.