Tamannah: బాలయ్య సర్ అంటే రెస్పెక్ట్.. చెత్తగా రాయకండి
Hyderabad: మిల్కీ బ్యూటీ తమన్నా(tamannah) కొన్ని మీడియా వెబ్సైట్లపై ఫైర్ అయ్యారు. తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని, రాసే ముందు ఆలోచించి రాయాలని క్లాస్ పీకారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. అనిల్ రావిపూడి(anil ravipudi), బాలకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా, బాలయ్య చేత అనిల్ రావిపూడి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసారట. అయితే తమన్నా సాంగ్‌కి ఓకే అన్నారు కానీ రెమ్యునరేషన్ రూ.1.5 కోట్లు అడిగారని రాసారట. ఈ విషయం కాస్తా తమన్నా నోటీస్‌కి రావడంతో ఆమె మండిపడ్డారు.
“నాకు అనిల్ రావిపూడి, బాలయ్య సర్లపై ఎంతో గౌరవం ఉంది. వాళ్ల సినిమాలో నేను ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నానంటూ మీరు రాస్తున్న చెత్త వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ చదువుతుంటే బాధగా ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేముందు రీసెర్చ్ చేసి రాయండి” అని ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడు తమన్నా ట్వీట్ రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తా అన్న దాని గురించా? లేక అసలు ఐటెం సాంగ్‌లోనే నటించడంలేదు అనే దాని గురించా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.