Adipurush: అర్హత లేకపోయినా లక్ష్మణుడిగా నటించా
Hyderabad: లక్ష్మణుడి పాత్రలో నటించే అర్హత లేకపోయినప్పటికీ డైరెక్టర్ ఓం రౌత్ (o raut) చెప్పారని ధైర్యం చేసానని అంటున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ (sunny singh). ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (adipurush) సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించాడు సన్నీ. ఈ సందర్భంగా అసలు తన దగ్గరికి లక్ష్మణుడి పాత్ర ఎలా వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
“నేను వేరే షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓం రౌత్ నాకు కాల్ చేసారు. నేను వెళ్లి కలిసాను. ఇది ఏ సినిమా డిస్కషన్ అని అడిగాను. ఆయన నాకు రామాయణం అని చెప్పలేదు. ఇదొక పెద్ద సినిమా అవుతుంది నువ్వు లక్ష్మణుడి పాత్రలో నటించాల్సిందే అన్నారు. అది వినగానే ఆహా ఎంత అదృష్టవంతుడిని అనుకున్నా. కానీ లక్ష్మణుడిగా నటించే అర్హత నాకు లేదు. అయినా సరే ఒప్పేసుకున్నా. సినిమా షూటింగ్ అయిపోయాక పోస్టర్లు రిలీజ్ అయ్యాక నాకు ఎంతో గౌరవం దక్కింది. నేను వేరే షూట్‌లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. వారికి నేను నిజంగానే లక్ష్మణుడిలా కనిపించానట. అది చూసి ఎంతో ఆనందమేసింది. ఇక సినిమా రిలీజ్ అవుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయ్. ప్రభాస్ (prabhas) సర్ అంటే రాముడిగా సరిపోయారు. ఆయన తమ్ముడు లక్ష్మణుడిగా ఉన్న నన్ను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి” అని తెలిపాడు సన్నీ.