Shilpa Shirodkar: బిగ్ బాస్‌లోకి న‌మ్ర‌త‌ సోద‌రి

Shilpa Shirodkar in bigg boss 18

Shilpa Shirodkar: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ‌త్ర శిరోద్క‌ర్ సోద‌రి శిల్పా బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన‌నున్నారు. అయితే మ‌న తెలుగు బిగ్‌బాస్‌లో కాదు. స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్‌లో. శిల్పా శిరోద్క‌ర్ కూడా త‌న సోద‌రి న‌మ్ర‌త లాగే ప‌లు సినిమాల్లో, టీవీ షోల‌లో న‌టించారు. పెళ్లి త‌ర్వాత న‌ట‌న మానేసారు. అయితే.. శిల్ప ఆస్తుల విలువ అంశం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆమె నెట్ వ‌ర్త్ రూ.237 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఇది న‌మ్రత నెట్ వ‌ర్త్ కంటే ఎక్కువ‌. న‌మ్ర‌త నెట్ వ‌ర్త్ కేవ‌లం రూ.50 కోట్లే అట‌.