షూటింగ్లో గాయపడిన సంజయ్ దత్!
Karnataka: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) భారీ ప్రమాదం బారిన పడ్డారు. ఓ సినిమా షూటింగ్ లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా కేడి(Kedi) టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ కన్నడ(Kannada) చిత్రానికి ప్రేమ్ (Prem)దర్శకుడు. ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. అందులో భాగంగా జరిగిన బ్లాస్టింగ్‌లో అనూహ్యంగా సంజయ్ దత్(Sanjay Dutt) చిక్కుకున్నారు.
పేలుడు కారణంగా రాళ్ళు, వస్తువులు వేగంగా వచ్చి సంజయ్ దత్ శరీరాన్ని తాకాయట. దీంతో ఆయన చేతులు, కాళ్లపై, భుజాల మీద గాయాలు అయ్యాయట. ఊహించని ఈ పరిణామానికి యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యారట. వెంటనే సంజయ్ దత్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారట. వైద్యులు పరీక్షలు జరిపి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది.
సంజయ్ దత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ బారిన పడిన సంజయ్ దత్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న అనంతరం నటుడిగా వరుస చిత్రాలు చేస్తున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt) కెజిఎఫ్(KGF) మూవీలో విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. యష్-ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2(KGF 2) లో సంజయ్ దత్ (Sanjay Dutt)అధీరా పాత్రలో భయపెట్టి నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.