Samantha: జ‌వాన్‌కి నో చెప్పిన సామ్?

షారుక్ ఖాన్ (shahrukh khan) అట్లీ (atlee) కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌వాన్ (jawan) సినిమాను సమంత నో చెప్పిందా? అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. న‌య‌న‌తార (nayanthara) ఇందులో పోలీస్ రోల్‌లో న‌టించింది. అయితే న‌య‌న‌తార కంటే ముందు ఈ రోల్ కోసం సమంత‌ను (samantha) కాంటాక్ట్ చేసాడ‌ట డైరెక్ట‌ర్ అట్లీ. కానీ సామ్ మ‌యోసిటిస్‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో హై యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించ‌లేన‌ని నో చెప్పింద‌ట‌. దాంతో ఆ రోల్ న‌య‌న‌కు ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ మ్యాన్ 2 (family man 2), య‌శోద (yashoda) సినిమాల్లో సామ్ యాక్ష‌న్ సీన్ల‌తో అద‌ర‌గొట్టింది. దాంతో జ‌వాన్ సినిమాలో సామ్‌ను తీసుకుంటే బాగుంటుంద‌ని అట్లీ అనుకున్నార‌ట‌. కానీ సామ్‌కి ఇప్పుడు అస్స‌లు ఓపిక‌లేదు. అందుకే జ‌వాన్‌లో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకుంది.