Renu Desai: బిడ్డకు టార్చర్.. ఆ కసాయి తల్లి వివరాలు కోరిన రేణూ
ఓ మహిళ పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసిన అంశంపై నటి రేణూ దేశాయ్ (renu desai) స్పందించారు. వెంకటరమణమ్మ తన బిడ్డను టార్చర్ పెడుతున్న వీడియోను ఎవరో రేణూకి షేర్ చేసారట. వెంటనే ఆమె వివరాలు తనకు ఎవరైనా పంపగలరా అని నెటిజన్లను కోరారు.
ఇదీ జరిగింది
పల్నాడు జిల్లాకు చెందిన వెంకటరమణమ్మ అనే మహిళ భర్త ఉండగా పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త శంకర్‌కు తెలీడంతో అతను విడాకులు కావాలని అడిగాడు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. భర్త విడాకులు అడిగాడని కోపంతో కన్న కొడుకును చిత్ర హింసలు పెట్టింది. పైగా చిత్రహింసలు పెడుతున్నప్పుడు తన ప్రియుడు రాజేష్ చేత వీడియోలు కూడా తీయించింది. ఆ వీడియోలను శంకర్‌కు పంపించడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.