Renu Desai: నా మాజీ భర్త గురించి మాట్లాడే హక్కు నాకుంది
నటి రేణూ దేశాయ్ (renu desai) దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ (ravi teja) టైటిల్ రోల్‌లో నటించిన టైగర్ నాగేశ్వరరావు (tiger nageswara rao) సినిమాలో హేమలత అనే కీలక రోల్‌లో రేణూ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
దాంతో ఓ నెటిజన్ రేణూకి ఉచిత సలహా ఇచ్చాడు. మేడమ్.. ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గురించి అడగకుండా చూస్కోమనండి అని కామెంట్ చేసాడు. దాంతో రేణూ ఎప్పటిలాగే ధీటుగా సమాధానం ఇచ్చారు. “” నేను ఎప్పుడు ఏం మాట్లాడాలో చెప్పడానికి మీరు ఎవరు? నా మాజీ భర్త గురించి మాట్లాడే హక్కు నాకుంది. ఆయన గురించి మాట్లాడద్దు అని చెప్పడానికి మీరు ఎవరు? మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు కామెంట్స్‌లపై నేను ఇలాగే కంట్రోల్ చేస్తున్నానా? “” అని మండిపడ్డారు.