Poonam Kaur: బాలకృష్ణ అల్లుడిపై నటి కామెంట్స్
Poonam Kaur: నటి పూనమ్ కౌర్.. నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌పై కామెంట్స్ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పోటీ చేస్తే చాలా బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని విద్య విషయంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో భరత్‌కు మంచి జ్ఞానం ఉందని తెలిపారు. అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలని తెలిపారు. ఇది ఎవరో చెప్తే తాను ట్వీట్ చేయడం లేదని.. తన పర్సనల్ ఒపీనియన్ అని స్పష్టం చేసారు.