OG: భారీ వ‌ర్షంలో క్రేజీ సీన్..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ.. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఓజీ (og) సినిమాపై మాత్రం భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వ‌చ్చినా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటోంది. ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇంకొన్ని కీల‌కమైన సీన్లు మాత్ర‌మే ఉన్నాయి. వాటిలో ఒక‌టి హైద‌రాబాద్ భారీ వ‌ర్షంలో రాత్రి స‌మ‌యంలో తీయ‌బోతున్నార‌ట‌. ఈ సీన్ క్రేజీగా ఉండ‌బోతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ఇక‌పోతే ఈ సినిమాకు.. ప్ర‌భాస్ (prabhas) న‌టించిన సాహో (saaho) సినిమాకు ఏదో లింక్ ఉండ‌బోతోంద‌ని కూడా టాక్. సాహో సినిమాను కూడా సుజీతే డైరెక్ట్ చేసారు. కానీ భారీ అంచనాల‌తో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం డిజాస్ట‌ర్ అయింది. అయితే సాహో సినిమాలోని కొన్ని సీన్ల‌ను ఓజీలో రిపీట్ చేయ‌నున్న‌ట్లు సెట్స్ నుంచి రిలీజ్ అయిన ఒక ఫొటోని బ‌ట్టి చూస్తే తెలుస్తోంది. ఇది చాలా పెద్ద సినిమా (og) అని ఇప్ప‌టికే మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ (ss thaman) హైప్ పెంచేసారు. సినిమా చూసి వ‌చ్చాక ఆడియ‌న్స్ ఓ మంచి సినిమా చూసాం అన్న సంతృప్తితో ఉంటార‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎలా చూడాల‌నుకుంటున్నారో.. సినిమా నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అంత‌కు మించి సినిమా ఉండ‌బోతోంద‌ని త‌మ‌న్ అన్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ చాలా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని, ఒక టీం అంతా స్పెష‌ల్‌గా ఓజీ (og) కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇందులో ప్ర‌కాశ్ రాజ్ (prakash raj) కూడా కీ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు.