NTR: పుష్ప-2 సెట్స్‌లో తారక్..ఎందుకెళ్లార‌బ్బా..?

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌(ntr).. పుష్ప 2(pushpa 2) సెట్స్‌కు వెళ్లారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప‌-2 సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. నిన్న తార‌క్ సెట్స్‌కు వెళ్లిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎందుకు వెళ్లి ఉంటారా అని ఫ్యాన్స్ కూడా ఆలోచ‌న‌లోప‌డ్డారు. తార‌క్‌-సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ ఏమైనా సినిమా రాబోతోందా అనే సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొన్న బ‌న్నీ బ‌ర్త్‌డేకి కూడా తార‌క్ విష్ చేస్తూ హ‌గ్స్ మాత్ర‌మేనా పార్టీ లేదా పుష్పా అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. ఇక‌పోతే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివతో క‌లిసి ఎన్టీఆర్ 30లో న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. దీంతో పాటు ఆయ‌న వార్-2తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వ‌బోతున్నారు.