RRR, పుష్ప సినిమాల్లో ఏముంది నచ్చడానికి?
రాజమౌళి తీసిన RRR సుకుమార్ తీసిన పుష్ప (pushpa) సినిమాలు తనకు నచ్చలేదని అసలు చూడాలని కూడా అనిపించలేదని అన్నారు బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా (naseeruddin shah). కానీ మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ (ponniyin selvan) మాత్రం చాలా నచ్చిందని తెలిపారు. ఎందుకంటే మణిరత్నం అజెండా లేని దర్శకుడు అని అన్నారు. పుష్ప, RRR సినిమాలు చూస్తే అసలు ప్రజలకు ఏమొస్తుందో అర్థంకావడంలేదని అవి అర్థంపర్థం లేని సినిమాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా RRR మహిళలకు ఎలా నచ్చిందో తనకు అర్థంకావడంలేదని తెలిపారు. “” మగవారికి ఇన్‌సెక్యూరిటీ (అభద్రతా భావం) పెరిగిపోతోంది. అమెరికాలో కూడా మార్వెల్ యూనివర్స్ పేరుతో తమ ఇన్‌సెక్యూరిటీని ప్రదర్శిస్తున్నారు. పుష్ప సినిమాల్లో కూడా మగతనం గురించే గొప్పలు చెప్పుకున్నారే తప్ప అందులో అసలు కంటెంటే లేదు “” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.