Custody Trailer: న్యాయం పక్కన నిలబడి చూడు!
Hyderabad: టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’(Custody). ఉప్పెన(Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. పోలీస్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో చై నిజాయతీ గల పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ గా కీలకపాత్రలో కనిపించనున్నారు.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. నెల రోజుల నుంచీ రకరకాల మార్గాల్లో తమ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు యూనిట్ సభ్యులు. నాగచైతన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న క్రిమినల్ తప్పించిన హీరో అతని కాపాడుకునే ప్రయత్నంలో ఎదురుకున్న సమస్యలే సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. పోలీస్ శివగా సీఎం కాన్వాయ్‌నే ఆపేసే ఫ్రేమ్‌తో మొదలయ్యే టీజర్ ‘ఒక్కసారి న్యాయంవైపు నిలబడి చూడు.. నీ జీవితమే మారిపోతుంది’ అనే నాగచైతన్య డైలాగ్‌తో ముగుస్తుంది. ప్రేమ, యాక్షన్ కలగలపిన కథతో మరోసారి నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.