Naga Chaitanya: జంగిల్లో నాగ చైతన్య, శోభిత వెకేషన్..?
Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాల (Sobita Dhulipala) ఒకే ప్రదేశంలో వెకేషన్లో ఉన్నారా? వారిద్దరూ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్రలోని తిపాయ్ జంగిల్లో వీరిద్దరూ కలిసే వెకేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శోభిత పోస్ట్ చేసిన ఫోటోలు.. నాగ చైతన్య పోస్ట్ చేసిన ఫోటో ఒకే ప్రదేశంలోవిగా అనిపిస్తున్నాయి. వీరిద్దరూ విడి విడిగా వెకేషన్కు వెళ్లి ఉంటే దాని లొకేషన్ పెట్టేవారు. కానీ వారిద్దరూ లొకేషన్ పెట్టలేదు. దాంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారన్న అనుమానాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి.
సమంతతో పెళ్లయ్యాక నాగచైతన్య శోభితకు దగ్గరయ్యారని ఆ కారణంతోనే చై సామ్ విడిపోయారని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లు బయటికి రావడానికి కారణం లండన్లోని ఓ రెస్టారెంట్లో నాగచైతన్య, శోభిత కలిసి తింటుండగా.. అక్కడే పనిచేస్తున్న భారతీయ చెఫ్ వారితో కలిసి సెల్ఫీ దిగి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాడు. దాంతో వీరిద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారు అనే గుసగుసలు మొదలయ్యాయి. దీనిపై నాగచైతన్య స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితానికి మూడో వ్యక్తికి సంబంధం లేదని అన్నారు. కానీ శోభిత మాత్రం కనీసం క్లారిటీ ఇవ్వలేదు. నా పర్సనల్ విషయాలపై నేనెందుకు క్లారిటీ ఇవ్వాలి అని కాస్త పొగరుగా సమాధానం ఇచ్చారు.
ALSO READ: