Naga Chaitanya: రాజస్థాన్‌లో పెళ్లి.. !
Naga Chaitanya: నాగచైతన్య శోభిత ధూళిపాల డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారు. రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. 2025 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అక్కడ గెస్ట్‌ల కోసం ముందుగానే ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ చేసేసినట్లు సమాచారం. ఆగస్ట్ 8న నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాగచైతన్య నివాసంలో కేవలం అక్కినేని కుటుంబీకుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత దగ్గుబాటి కుటుంబీకులు చైతన్య, శోభితల కోసం గ్రాండ్‌గా హై టీ పార్టీ ఏర్పాటుచేసారని టాక్.