Naga Chaitanya: చై, శోభిత‌… మ‌ళ్లీ వైర‌ల్..!

నాగ చైత‌న్య‌ (naga chaitanya), స‌మంత‌లు (samantha) విడాకులు తీసుకున్న విష‌యం ఎంత షాక్‌కి గురిచేసిందో.. చై న‌టి శోభిత ధూలిపాల‌ను (sobhita dhulipala) డేట్ చేస్తున్నార‌న్న రూమ‌ర్ అంత‌కంటే ఎక్కువే షాకింగ్‌గా ఉంది. శోభిత‌తో డేటింగ్‌లో ఉండ‌టం వ‌ల్లే చై సామ్ విడిపోయార‌ని అంతా అనుకుంటున్నారు. అందులోనూ నాగ చైత‌న్య‌, శోభిత‌లు క‌లిసి లండ‌న్‌లోని ఓ రెస్టారెంట్‌కు క‌లిసే వెళ్లిన ఫోటో కూడా కొన్ని నెల‌ల క్రితం వైర‌ల్‌గా మారింది.

ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల వ‌ల్ల దొరికేసారు. రెండు రోజుల క్రితం శోభిత‌.. ఓ బుక్ గురించి వివ‌రిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అదే పుస్త‌కాన్ని నాగ‌చైత‌న్య 2021లో చదివిన‌ట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు. దాంతో ఇద్ద‌రి ద‌గ్గ‌ర ఒకే ర‌క‌మైన బుక్ ఉందంటే.. దానిని చైత‌న్య‌నే శోభిత‌కు ఇచ్చాడా అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. శోభిత గురించి త‌న గురించి వ‌స్తున్న రూమ‌ర్స్‌పై చై ఒక‌సారి రియాక్ట్ అవుతూ.. త‌న మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అవ్వ‌డానికి మూడో వ్య‌క్తిని లాగుతున్నార‌ని అది చాలా త‌ప్పని అన్నాడు. కానీ శోభిత మాత్రం చై గురించి ఎప్పుడు అడిగినా.. అందులో ఏమాత్రం నిజం లేద‌ని కానీ.. అలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్ద‌ని కానీ ఎప్పుడూ చెప్ప‌లేదు. ఈ మ్యాట‌ర్ గురించి ఎప్పుడు అడిగినా.. నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? అనేసి ఊరుకున్నారే త‌ప్ప ఇది 100% అబ‌ద్ధం అని మాత్రం చెప్ప‌లేదు. (naga chaitanya)