Movie Promotions మితిమీరుతున్నాయ్..!
సినిమాకు ఎంత బాగా ప్రమోషన్స్ చేస్తే (movie promotions) అంత రీచ్ వస్తుంది కానీ అంత హిట్ మాత్రం అవ్వదు. ఎందుకంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది చేసే ప్రమోషన్స్ మీద ఆధారపడి ఉండదు. మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్ అంటే ఒక ఇంటర్వ్యూ, లేదా గేమ్ షోలలో పాల్గొనడం లాంటివి చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. చెప్పాలంటే మితిమీరిపోయింది. నిన్న ఖుషి (kushi) ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ (vijay devarakonda), సమంత (samantha) కాస్త మితిమీరినట్లుగా స్టేజ్‌పై డ్యాన్స్ చేసారు. వారిద్దరి ఇన్‌టిసీపై ట్రోల్స్ కూడా పేలుతున్నాయ్.
ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అయ్యి వైరల్ అవుతున్నాడు విశ్వక్ సేన్ (vishwak sen). నేహా శెట్టి, విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (gangs of godavari) ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజ్‌పై నేహా తన చీర కొంగు తీసి విశ్వక్ మెడపై వేసి మరీ డ్యాన్స్ చేయడం కాస్త ఇబ్బందిరకంగా అసభ్యకరంగా ఉంది. ఇంత చేయాల్సిన అవసరం లేదని కొందరు నెటిజన్లు కూడా అంటున్నారు. ఇలాంటి సన్నివేశాల్లో సినిమాల్లో చూడటం వరకు బాగుంటాయ్ కానీ ఇలా స్టేజ్‌పై లైవ్‌లో చేయాల్సిన అవసరం లేదు కదా..! ఇలాంటి డ్యాన్సులు చేసినప్పుడు జనాలంతా దాని గురించే మాట్లాడుకుంటారు కానీ ఎవ్వరూ కూడా ఫలానా హీరో హీరోయిన్ అలా చేసారు కాబట్టి ఆ సినిమా కూడా చూద్దాం అని అనుకోరు. (movie promotions)