Minu Muneer: ఆ దర్శకుడు నా ముందే గ్రూప్ సెక్స్ చేసాడు
Minu Muneer: మలయాళ చిత్రపరిశ్రమలో హేమ కమిటీ రిపోర్టు బయటికి రావడంతో మాలీవుడ్‌కి చెందిన చాలా మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతన్నారు. తాజాగా మిను మునీర్ అనే నటి దర్శకుడు, నటుడైన బాలచంద్ర మేనన్‌పై సంచలన ఆరోపణలు చేసారు. హేమ కమిటీ రిపోర్టు ద్వారా చేసిన విచారణ తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఓ నటిని లైంగికంగా వేధించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదని కానీ కేరళ ప్రభుత్వం లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు.
“” ఎప్పుడైతే ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం చేస్తాను అన్నారో అప్పుడే నా పట్ల జరిగిన దారుణాన్ని బయటపెట్టాలని అనుకున్నాను. 2007లో బాలచంద్రన్ మేనన్ దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. సినిమాలో అవకాశం ఉందని చెప్పి నన్ను ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో బాలచంద్రన్ నన్ను బలవంతంగా బెడ్‌రూంకి తీసుకెళ్లాడు. అక్కడ బెడ్‌పై ముగ్గురు అమ్మాయిలు బాలచంద్రన్ ఉన్నారు. నాతో పాటు మరో ఇద్దరు అబ్బాయిలకు ఆ దారుణ చర్యను బలవంతంగా చూపించాడు. ఎన్నో కలలతో చిత్ర పరిశ్రమకు వచ్చాను. పలు సినిమాల్లో నటించాను కానీ నేను అనుకున్న స్థానానికి మాత్రం చేరలేకపోయాను. ఈ హేమా కమిటీ రిపోర్టుతో ఇప్పుడిప్పుడు ఎన్నో కలలతో చిత్ర పరిశ్రమకు వస్తున్నవారికి న్యాయం జరగాలి “” అని వెల్లడించారు.