Meenakshi Chaudhary: న్యూడ్ సీన్స్ అవ‌స‌రమేముంది?

Hyderabad: త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో పెద్ద ఆఫ‌ర్లు అందుకుంటోంది మీనాక్షి చౌద‌రి (meenakshi chaudhary). ఇచ్చ‌ట వాహ‌నాలు నిల‌ప‌రాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ఖిలాడి సినిమాతో కాస్త పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత హిట్-2తో మంచి పేరు కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా గుంటూరు కారం (guntur kaaram) సినిమాలో మ‌హేష్ బాబుతో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఎలాంటి క్యారెక్ట‌ర్స్ ఇచ్చినా చేస్తాను కానీ.. న్యూడ్ సీన్స్ ఉంటే మాత్రం అస్స‌లు ఒప్పుకోను అంటోంది. (meenakshi chaudhary)

“” గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో చెప్ప‌లేను. దీంతో పాటు వ‌రుణ్ తేజ్, విశ్వ‌క్ సేన్‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాను. నాకు ఈ మ‌ధ్య‌కాలంలో చాలా స్క్రిప్ట్స్ వ‌చ్చాయి. ఏదో బిజీగా ఉండాలి కాబట్టి నేను సినిమాలు చేయాల‌ని అనుకోవ‌డం లేదు. నేను చేసే సినిమా గొప్పగా ఉండాల‌ని అనుకుంటున్నాను. అందుకే మ‌ళ్లీ స్క్రిన్ మీద క‌నిపించ‌డానికి టైం ప‌ట్టింది. వ‌రుణ్ తేజ్, విశ్వ‌క్ సేన్‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌బోయే సినిమాల కాన్సెప్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అందుకే క‌థ విన‌గానే క్ష‌ణం ఆలోచించ‌కుండా ఒప్పుకున్నాను “”

“” నేను చేయ‌బోయే సినిమా ఏ భాష‌లో అయినా ఫ‌ర్వాలేదు కానీ.. నా ప‌నిత‌నాన్ని అంద‌రూ మెచ్చుకోవాలి అనుకుంటాను. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్క‌డే చాలా సినిమాలు చేయాల‌ని ఉంది. అయితే నేను ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందే ఒక రూల్ పెట్టుకున్నాను. న్యూడ్ సీన్లు ఉంటే అస్స‌లు చేయకూడ‌దు అని. ఈ ఒక్క పాయింట్ వల్లే చాలా సీన్లు రిజెక్ట్ చేసాను. ఇక కిస్సింగ్ సీన్స్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఓకే కానీ ఆడియ‌న్స్ వ‌స్తారు క‌దా అని ఇలాంటి సీన్స్ పెడితే మాత్రం నేను అస్స‌లు ఒప్పుకోను. చక్క‌గా యాక్ట్ చేస్తే స‌రిపోతుంది కదా.. దానికి న్యూడ్ సీన్లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది “” అని అంటున్నారు మీనాక్షి.