Manchu Manoj: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను
Hyderabad: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నటుడు మంచు మనోజ్ (manchu manoj). మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి కుమారుడు ధైరవ్ ఈరోజు తన 5వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధైరవ్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మనోజ్.
“” నీ బర్త్‌డే సందర్భంగా.. నిన్ను నా జీవితంలోకి పంపినందుకు ఆ పరమ శివుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నీ రాక నాకు ఒక పండుగ లాంటిదే కాదు నన్ను బెటర్ పర్సన్‌ని చేయడంలో మొదలైన జర్నీ. ఈ జర్నీని నా జీవితంలోని ప్రతి రోజూ గుర్తుపెట్టుకుంటాను. నీ నవ్వు, నీ అమాయకమైన కళ్లు, నీ ప్రేమించే హృదయమే నన్ను నడిపిస్తుంటాయి. నా జీవితంలో నువ్వు ఉండటం, మీ అమ్మ ప్రేమానురాగాలు నన్ను నేను మరింత అర్థంచేసుకునేలా చేసాయి “”
“” నీ నవ్వులు, నీ కౌగిలింతలు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నీ రాకతో నా జీవితం మరింత రంగులమయం అయ్యింది. నీ 5వ బర్త్‌డే రోజున నీ పూర్వీకుల జ్ఞానంతో నువ్వు మరింత ఎదగాలని ఈ ప్రపంచాన్ని నీ చిట్టి చేతుల్లోకి తీసుకుని ఎంజాయ్ చేస్తావని కోరుకుంటున్నాను. నీ జీవితం ఇప్పుడే మొదలైంది ధైరవ్. నువ్వు నడిచే ప్రతి అడుగులో నీ చెయ్యి పట్టుకుని నీకు తోడుంటానని మాటిస్తున్నా “” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచారు మనోజ్. (manchu manoj)
మౌనిక రెడ్డికి మనోజ్‌కి ఇది రెండో పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసిందే. మౌనికకు మొదట గణేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి పుట్టిన కుమారుడే ధైరవ్. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. మనోజ్ కూడా తన మొదటి భార్య ప్రణతితో విడిపోయారు.