Malla Reddy: హాలీవుడ్, బాలీవుడ్ మా చేతుల్లోనే.. హైద‌రాబాద్ వ‌చ్చేయ్ ర‌ణ్‌బీర్..!

Malla Reddy: ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir kapoor), ర‌ష్మిక మంద‌న (rashmika mandanna) క‌లిసి న‌టించిన యానిమ‌ల్ (animal) సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న టీం హైద‌రాబాద్‌లోని మ‌ల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సంద‌డి చేసారు. ఈ ఈవెంట్‌కు మ‌హేష్ బాబు (mahesh babu), రాజ‌మౌళి (rajamouli) గెస్ట్‌లుగా వ‌చ్చారు. మ‌ల్లారెడ్డి కూడా సంద‌డి చేసారు.

అయితే.. మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. రేపు బాలీవుడ్‌, హాలీవుడ్ కూడా టాలీవుడ్ చెప్పుచేత‌ల్లోనే ఉంటాయ‌ని.. ముంబైని వ‌దిలి హైద‌రాబాద్‌కి రావాల‌ని ర‌ణ్‌బీర్‌తో అన్నారు. ముంబైలో పాత‌ది అయిపోయింద‌ని.. బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఎక్కువ‌ని.. ఏ స‌మ‌స్యా లేని న‌గ‌రం అంటే హైద‌రాబాదేన‌ని తెలిపారు. దాంతో స్టూడెంట్స్ కూడా విజిల్స్ వేసి మ‌ల్లారెడ్డిని మ‌రింత ఎంక‌రేజ్ చేసారు. మ‌ల్లారెడ్డి కాలేజ్‌కి వ‌చ్చి యానిమ‌ల్ సినిమా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు కాబ‌ట్టి యానిమ‌ల్ సినిమా రూ.500 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని మ‌ల్లారెడ్డి అన్నారు. (animal)