Mahesh Babu: వచ్చేస్తున్నా..!
Hyderabad: సూపర్‌స్టార్ మహేష్ బాబు (mahesh babu) కొత్త లుక్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కొత్త లుక్‌ను పోస్ట్ చేసి కమింగ్ సూన్ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే దేని గురించి ఆయన ఈ పోస్ట్ పెట్టారన్నది తెలియరాలేదు. బహుశా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారం (guntur kaaram) షూటింగ్ ఫాస్ట్‌గా అయిపోతోందని ట్రైలర్ ఆన్ ది వే అని చెప్పడానికి కావచ్చు అని ఫ్యాన్స్ అంటున్నారు. హైదరాబాద్‌లోని BHELలో గుంటూరు కారం కోసం హై యాక్షన్ ఫైట్ సీన్లు తీస్తున్నారు. ఇందులో శ్రీలీల (Sreeleela) సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూజా హెగ్డే (pooja hegde) మెయిల్ హీరోయిన్ రోల్‌కి ఓకే అయినప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆమెను తీసేసారు. ఆ తర్వాత మీనాక్షి చౌదరిని (meenakshi chaudhary) ఎంపికచేసారని వార్తలు వచ్చాయి కానీ టీం నుంచి ఇంకా సరైన క్లారిటీ లేదు.