Devara: తారక్ అనూహ్య నిర్ణయం
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) నటిస్తున్న దేవర సినిమా కోసం ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో వస్తున్న దేవర సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్లో పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా దేవర. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటూ పోవాలి కానీ ఎక్కడా కూడా తక్కువ కాకూడదు అని తారక్ నిర్ణయించుకున్నారు. అందుకే సినిమా కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఈ సినిమాను కేవలం ప్రమోట్ చేయడానికి మాత్రమే రెండు నెలల సమయాన్ని వెచ్చించనున్నారట. (Devara)
యావత్ భారతదేశంలోని 27 నగరాల్లో తారక్ దేవర సినిమాను ప్రమోట్ చేయనున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా సినిమాలకు సంబంధించి ప్రమోషన్లు జరగవు. కానీ ఎన్టీఆర్ ఆ ఈశాన్య ప్రాంతాలను కూడా కవర్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ భైరా అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయం అయింది. దాంతో ఆయన చేతికి సర్జరీ జరిగి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే దేవర షూటింగ్ మధ్యలో ఆగిపోయిందని తెలుస్తోంది. అందుకే ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది.
పెండింగ్‌లో 4 పాటలు
అయితే దేవరలో ఇంకా 4 పాటల షూటింగ్ పెండింగ్‌లో ఉందట. రానున్న రోజుల్లో కేవలం ఎన్టీఆర్, జాన్వితో పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం షూటింగ్ అయ్యేసరికి ఇంకో 35 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం షూటింగ్ అయ్యాక కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. ఆ తర్వాత దేవర పార్ట్ 2 కూడా మొదలైపోతుంది.
మాట నిలబెట్టుకున్న తారక్
దేవర (devara) సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తారక్ కేవలం తెలుగులో మాత్రమే తన వాయిస్‌లో మాత్రమే డబ్బింగ్ చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి దేవర సినిమాకు గానూ మలయాళంలోనూ తన వాయిస్‌తో డబ్బింగ్ చెప్పనున్నారు. అయితే మొత్తం సినిమాకు ఆయన డబ్బింగ్ చెప్పరు కానీ.. దేవర గ్లింప్స్ మలయాళ వెర్షన్‌కు మాత్రం తారక్ డబ్బింగ్ చెప్పారు.
ఇలాంటి ప్రయత్నం చేసిన ఏకైక టాలీవుడ్ స్టార్ తారకే కావడం విశేషం. తారక్ తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడతారో మలయాళంలోనూ అంతే స్పష్టంగా డైలాగులు చెప్పడంపై మల్లు అభిమానులు కూడా తారక్‌కు ఫిదా అయిపోయారు. RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో అన్ని భాషల్లో తాను డబ్బింగ్ చెప్పారు. కానీ మలయాళ వెర్షన్ మాత్రం మిస్ అయ్యారు. అప్పుడే తారక్ మల్లు ఫ్యాన్స్‌కి తన తర్వాతి సినిమాతో తప్పకుండా మలయాళంలో డబ్బింగ్ చెప్తానని ప్రామిస్ చేసారు. ఆ ప్రామిస్‌ను మొత్తానికి నిలబెట్టుకున్నారు.