Kangana Ranaut: కంగ‌న‌కు రేప్ బాగా అనుభ‌వం ఉన్న‌ట్టుంది

bjp mla shocking comments on kangana ranaut

Kangana Ranaut: ఖ‌లిస్తానీ లీడ‌ర్ సిమ్ర‌న్‌జిత్ సింగ్ మాన్.. బాలీవుడ్ న‌టి, మండి ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. పంజాబ్ రైతులు ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలోనే దేశంలో అత్యాచారాలు ఎక్క‌వ‌య్యాయ‌ని కంగ‌న వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో సిమ్ర‌న్‌జిత్ ఆగ్రహం వ్య‌క్తం చేసారు. కంగ‌న‌కు అత్యాచారాల ప‌ట్ల బాగా అనుభ‌వం ఉన్న‌ట్టుంద‌ని.. అందుకే అలా కామెంట్ చేసార‌ని అన్నారు.

కంగ‌న చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఓ జ‌ర్న‌లిస్ట్ అడ‌గ్గా.. దానికి సిమ్ర‌న్‌జిత్ స్పందిస్తూ.. కంగ‌న‌నే రేప్ ఎలా అవుతుందో అడ‌గండి. ఆమెకు ఈ విష‌యంలో బాగా అనుభ‌వం ఉంది క‌దా అన్నారు. దీనికి స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్.. కంగ‌న‌కు ఎలా అనుభవం ఉంటుంది అని అడ‌గ్గా.. ఎందుకు అనుభ‌వం ఉండ‌దు. సైకిల్ తొక్కేవాడికి ఎలా అనుభ‌వం ఉంటుందో రేప్‌ల‌కు అల‌వాటు ప‌డిన వారికి అది అనుభ‌వం ఉంటుంది అని అన‌డంతో ఆ జ‌ర్న‌లిస్ట్ నోరెళ్ల‌బెట్టి చూస్తుండిపోయారు. దాంతో సిమ్ర‌న్‌జిత్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.