Katrina Kaif భర్తను తోసేసిన సల్మాన్ బాడీగార్డ్!
Mumbai: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (katrina kaif) భర్త విక్కీ కౌశల్‌కు (vicky kaushal) అవమానం జరిగింది. నిన్న ముంబైలో IIFA రాక్స్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు విక్కీ కౌశల్, సల్మాన్ ఖాన్‌తో పాటు ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. అయితే సల్మాన్ ఖాన్ (salman khan) ఈవెంట్‌కు వస్తున్న సమయంలో విక్కీ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. సల్మాన్ ఎదురుగా విక్కీ ఉండటంతో బాడీగార్డు ఓ సాధారణ వ్యక్తిని తోసేసినట్లు విక్కీని పక్కకు తోసారు. ఇది కెమెరాల్లో రికార్డ్ అవడంతో తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు సల్మాన్, కత్రినా ప్రేమించుకున్న సంగతి ప్రపంచమంతా తెలుసు. కత్రినాను బాలీవుడ్‌కి పరిచయం చేసింది సల్మానే. ఆమెకు సరిగ్గా హిందీ నేర్పించి, సినిమాలు లేకపోతే ప్రొడ్యూసర్లతో మాట్లాడి ఇలా కత్రినా కోసం ఎంతో చేసాడు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సల్మాన్, కత్రినా విడిపోవాల్సి వచ్చింది. విక్కీని పెళ్లి చేసుకున్నప్పటికీ కత్రినా సల్మాన్ ఫ్యామిలీతో ఇంకా టచ్‌లో ఉంది. ఈద్ పార్టీలకు, సల్మాన్ ఇంట్లో జరిగే ఈవెంట్లకు కత్రినా కంపల్సరీగా వెళ్తుంది. కానీ విక్కీ కౌశల్ (vicky kaushal) విషయంలో జరిగింది మాత్రం తప్పని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై విక్కీ స్పందించారు. ఒక్కోసారి మనం చూసింది తప్పు కావచ్చని, దాని గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు.