Venkatesh: వెంకీ మామ సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా?

Venkatesh: విక్ట‌రీ వెంక‌టేష్ సినిమాల నుంచి రిటైర్ అవ్వ‌బోతున్నారా? దాదాపు 40 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో కొనసాగుతున్న వెంక‌టేష్ విభిన్న సినిమాల‌తో ఈ వ‌య‌సులోనూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు సైంధ‌వ్ అనే థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇది వెంక‌టేష్ 75వ సినిమా. ఇందుకోస‌మే గ్రాండ్‌గా ఇండస్ట్రీ పెద్ద‌ల‌ను పిలిపించి మ‌రీ సెల్ర‌బేట్ చేసుకున్నారు.

గ‌త ప‌దేళ్ల కాలంలోనే తాను సినిమాల నుంచి రిటైర్ అవ్వాల‌నున్నాన‌ని వెంక‌టేష్ అన్నారు. ఇంకెన్నాళ్లు సినిమాలు చేస్తాం యువ న‌టుల‌కు అవ‌కాశం ఇవ్వ‌చ్చు అనే ఉద్దేశంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌నుకున్నార‌ట‌. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) త‌న 150వ సినిమాగా ఖైదీ నెం 150 చేసారో అప్పుడే త‌న‌కు కూడా సినిమాలు చేయడం కొన‌సాగించాల‌నిపించింద‌ని అన్నారు. అయితే ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూటింగ్ అయిపోయాక మెల్లిగా సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.