Hema Malini: భర్త లేని జీవితం ఎవరికి నచ్చుతుంది?
Hyderabad: డ్రీమ్‌గర్ల్ హేమమాలిని (hema malini), ధర్మేంద్రల (dharmendra) లవ్ స్టోరీ గురించి తెలిసిందే. అప్పటికే ప్రకాశ్ కౌర్ (prakash kaur) అనే మహిళతో పెళ్లైన ధర్మేంద్ర విడాకులు కూడా ఇవ్వకుండా హేమమాలిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఇద్దరు కూతుళ్లను కన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ధర్మేంద్ర చాలా కాలంగా మొదటి భార్య వద్దే ఉంటున్నారు. మొన్న మనవడి పెళ్లి సమయంలోనూ హేమమాలిని కానీ కూతుళ్లను కానీ ధర్మేంద్ర పిలవలేదు. ఆ తర్వాత వారిని పిలవనందుకు ధర్మేంద్ర (dharmendra) సారీ కూడా చెప్పారు. అయితే అసలు ఎందుకు ధర్మేంద్రతో కలిసి ఉండటంలేదు అనే విషయంపై హేమమాలిని (hema malini) స్పందించారు.
“భర్త లేకుండా జీవించాలని ఏ ఆడది కోరుకుంటుంది అంటూ తన బాధను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి జీవితం ఎవరు కావాలని కోరుకుంటారు. ప్రతి ఆడది భర్త, పిల్లలతో కలిసే ఉండాలని కోరుకుంటుంది. కానీ అది అందరికీ దొరకదు. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు. అలాంటప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతకు మించి ఏం చేస్తాం చెప్పండి. ధర్మేంద్ర నాతో ఉండటం లేదని నాకు ఎప్పుడూ బాధలేదు. ఎందుకంటే ఆయన మాతో ఉండకపోయినా మా మంచి గురించే ఆలోచిస్తుంటారు. నిజానికి పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని నాకంటే ఆయనే ఎక్కువ ఆలోచించేవారు. దేవుడి దయ వల్ల వారికి మంచి భర్తలు వచ్చారు“ అని వెల్లడించారు హేమ.