Harish Shankar: ప్రాణం పెట్టి తీయ‌డం కాదు.. ర‌వి నా ప్రాణం

Harish Shankar says ravi teja is his soul

Harish Shankar: హ‌రీష్ శంక‌ర్.. మాస్ మ‌హారాజ ర‌వితేజ కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. ఆల్రెడీ వీరిద్ద‌రి కాంబోలో నేనింతే, నిప్పు వ‌చ్చాయి. ఇప్పుడు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ చాలా విభిన్నంగా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ అభిమాని ఒక‌రు ఇంత బాగా సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నందుకు హ‌రీష్ శంక‌ర్‌కు ట్విట‌ర్ వేదిక‌గా థ్యాంక్స్ చెప్పాడు.

మీ ప్రాణం పెట్టి ర‌వి తేజ అన్న కోసం ఈ సినిమా తీసి అదే స్థాయిలో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్ హ‌రీష్ అన్నా. ఈసారి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతున్నాం అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్‌కి హ‌రీష్ శంక‌ర్‌కు రిప్లై ఇస్తూ.. ప్రాణం పెట్టి తీయ‌డం ఏంటి.. ర‌వితేజ నా ప్రాణం అని స‌మాధానం ఇచ్చారు. ఆ ఒక్క స‌మాధానంతో హ‌రీష్ శంక‌ర్ ర‌వితేజ అభిమానుల మ‌న‌సుల్ని దోచుకున్నారు.